మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఉద్యమ నేతలపై ముఖ్యమంత్రి జగన్ అణచివేత ధోరణిని నిరసిస్తూ నంద్యాల పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారన్నారు. వైకాపా నాయకులు అడుగులకు మడుగులోత్తుతూ పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో లబ్ధి పొందిన ఐటీ విభాగ నిపుణులు దాదాపు పెద్ద ఎత్తున హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారని, ఇప్పటికైనా జగన్ మేల్కొని చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Bhuma: చంద్రబాబు అరెస్టుకు మూల్యం చెల్లించక తప్పదు
సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో భూమా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES