Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma: తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు

Bhuma: తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇటీవల గంజాయి డ్రగ్స్ మాఫియా ఎక్కువై పోయిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు.   గతంలో ఆదర్శవంతమైన ఏపీ నేడు ఏపీ అంటే గంజాయి డ్రగ్స్ తప్పుడు కేసుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచారని భూమా ఆరోపించారు.  దీనంతటికీ కారణం వైఎస్ఆర్సిపి నాయకులేనని ఆమె భగ్గుమన్నారు.  గంజాయి తిరుమల పవిత్రతను సైతం దెబ్బతీస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు డ్రగ్స్ దేశంలోనే 26శాతం అధికంగా తిరుపతిలోనే నార్కోటెక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్సుకు యువత అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని అన్నారు.

- Advertisement -

దాదాపు రెండు లక్షల కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గతంలో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గంజాయిని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారనే నెపంతోనే డీజీపీగా ఉన్న సవాంగును సాధారణ బదిలీ చేశారని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. డ్రగ్స్ గంజాయి తో 575 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ తెలిపారని గంజాయి సరఫరా చేయడంలో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.  పుణ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతి నేడు డ్రగ్స్ కేంద్రంగా మారిందన్నారు తిరుపతి నుండి కర్ణాటక తమిళనాడు తదితర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారని ఆమె తెలిపారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో తాత్కాలికంగా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వారు గంజాయి  సరఫరా చేయడంతో వారిని ఉద్యోగం నుండి తొలగించారని అనంతరం అరెస్టు చేశారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News