Home ఆట PV Sindhu Academy: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి పీవీ సింధు భూమి పూజ

PV Sindhu Academy: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి పీవీ సింధు భూమి పూజ

0
PV Sindhu Academy: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి పీవీ సింధు భూమి పూజ

PV Sindhu Academy| విశాఖపట్టణంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలిపింక్స్ పతక విజేత పీవీ సింధు భూమి పూజ చేశారు. విశాఖ జిల్లాలోని ఆరిలోవలో ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల భూమిలో ఈ అకాడమీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ సంవత్సర కాలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

విశాఖలో బ్యాడ్మింటన్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ ఉందని ఆమె పేర్కొన్నారు. తమ అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని… ఇప్పటికే ఇందుకోసం అన్ని అనుమతులు వచ్చాయని స్పష్టంచేశారు. ఈ అకాడమీ నుంచి ఎంతోమంది క్రీడాకారులను పథకాలు సాధించేలా చేయడమే తన లక్ష్యమని సింధు చెప్పుకొచ్చారు.