Big alert for parents Pulse polio for children under five years: మీకు ఐదేళ్లలోపు చిన్న పిల్లలున్నారా?.. అయితే, మీకో బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తోంది. 5 ఏళ్లలోపు 54 లక్షలకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించింది. అందుకు తగిన విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరు 21న బూత్‌ల వద్ద పిల్లలకు పోలియో చుక్కలు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పలు కారణాల వల్ల గతంలో పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మరలా పోలియో చుక్కలు వేయడం జరుగుందని పేర్కొన్నారు. పల్స్ పోలియో చుక్కల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 76,534 బృందాలు పనిచేస్తున్నాయని, వారంతా పోలియో చుక్కలు వేసింగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలియో రోగాన్ని సోకకుండా చూసుకోవడం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రబుత్వం సూచించింది. ఈ పోలియో చుక్కల కార్యక్రమంలో మొత్తం 1,704 మెడికల్ అధికారులు, 39,494 ఇతర సిబ్బంది, ఫార్మాసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అలాగే 4,206 అబ్జర్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read: https://teluguprabha.net/health-fitness/who-should-avoid-fenugreek-water-health-risks-explained/
రాష్ట్రవ్యాప్తంగా 1854 మొబైల్ బృందాలు..
కాగా, పోలింగ్ కేంద్రాలకు వచ్చి చుక్కలు వేయించుకోలేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1854 మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కల ప్రక్రియను పూర్తి చేస్తారన్నారు. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు సహాయకులు ఉంటారని తెలిపారు. కాగా, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు “P” గుర్తు, మిస్సైన పిల్లలకు “X” గుర్తు వేసి పోలియో చుక్కలను పూర్తి చేస్తారు. అలాగే, అన్ని ట్రాన్సిట్ పాయింట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్లు వంటి ప్రదేశాల్లో 21-23 డిసెంబర్ వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి స్లమ్ ఏరియాలు, బస్తీలు, నిర్మాణ స్థలాలు, వలస ప్రాంతాలు, సంచార జాతులు నివసించే ప్రాంతాలను కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు, 1,140 ట్రాన్సిట్ బూత్‌లు ఏర్పాట్లు చేశారు. ప్రతి తల్లి, తండ్రి తమ 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా అందించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.

