Thursday, December 19, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP Leaders: టీడీపీ నేతలకు తప్పిన పెను ప్రమాదం

TDP Leaders: టీడీపీ నేతలకు తప్పిన పెను ప్రమాదం

TDP Leaders: తెలుగుదేశం పార్టీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్(KUDA) అథారిటీ ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజప్పలు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితర నేతలు అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

అయితే వేదికపైకి పరిమితికి మించి నాయకులు రావడంతో ఒక్కసారిగా కుప్పుకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వేదిక ఎక్కువ ఎత్తు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గజమాల వేసేందుకు కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజి మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News