Jagan| వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలింది. పల్నాడు జిల్లాలో జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్(Saraswati Power Industries)లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరకాలను స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు ఉన్నాయి. స్థానిక తహసీల్దార్ ఈమేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా సరస్వతి భూముల అంశంలో జగన్, ఆయన సోదరి షర్మిల(YS Sharmila), తల్లి విజయమ్మ(YS Vijayamma) ఆస్తుల వివాదం కోర్టుకు చేరడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో పర్యటించి భూములను పరిశీలించారు. లబ్ధిదారులకు డబ్బులు చెల్లించుకుండా అప్పన్నంగా భూములు కొట్టేశారని ఆరోపించారు. అనంతరం ఈ భూములను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ప్రకారం అవి అసైన్డ్ భూములు అని తేలడంతో వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.