Big Update On Thalliki vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడతకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రంలో విద్యార్థుల తల్లులకు ఆర్థికంగా సహాయపడేందుకు రూపొందించిన ఈ పథకం క్రింద, జూలై 10వ తేదీన రెండో విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా మొదటి విడతలో దాదాపు 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందిన తరగతుల ప్రకారం, మొదటిగా 1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేరిన వారికి ఈ సహాయాన్ని అందజేశారు.
రెండో విడతలో ఎవరెవరికి నిధులు?
రెండో విడతలో కూడా మొదటి తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులకు నిధులు జమ చేయనున్నారు. ఈ విడతలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులుగా పరిగణించబడుతున్నారు. అలాగే కేంద్ర విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. 9వ, 10వ తరగతులు మరియు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేయనున్నారు. వీటిలో కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీ వినియోగం ఆధారంగా కొన్ని కుటుంబాలు అర్హత కోల్పోయినా, 300 యూనిట్లకు లోపల విద్యుత్ వినియోగించిన కుటుంబాలకు ఇప్పుడు మళ్లీ నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం.
లబ్ధిదారులు ఎలా చెక్ చేసుకోవాలి?
ఈ పథకం లబ్ధిదారులను తెలుసుకోవడానికి ప్రభుత్వం తల్లికి వందనం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసి, పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పథకం విద్యార్ధులకు ప్రోత్సాహం కల్పించడమే కాకుండా, తల్లుల ఆర్థిక భద్రతను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న వినూత్న చర్యగా నిలుస్తోంది.