Saturday, February 8, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: చంద్రబాబు ప్రచారం.. ముందంజలో బీజేపీ అభ్యర్థులు

Chandrababu: చంద్రబాబు ప్రచారం.. ముందంజలో బీజేపీ అభ్యర్థులు

కూటమి నేతలు ఉత్తరాది రాష్ట్రాల్లో అదరగొడుతున్నారు. తమను నమ్ముకున్న పార్టీకి అండగా నిలబడుతున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. నిన్న ఢిల్లీలో చంద్రబాబు(Chandrababu) బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది.

- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ​కల్యాణ్(Pawan Kalyan)​ ప్రచారం చేశారు. పుణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎక్కవ శాతం నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి గెలుపొందింది.

ఇక ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న షాదారా, విశ్వాస్‌ నగర్‌, సంగం విహార్‌, సహద్ర వంటి ప్రాంతాల్లో చంద్రబాబు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం. దీంతో కూటమి నేతలు దేశంలో బీజేపీ విజయానికి అండగా నిలబడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News