బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో భూ పరీక్షా శిక్షణ వారంలో భాగంగా వెల్దుర్తి మండలం లోని రైతు భరోసా సిబ్బందికి MPEOsకి భూసార పరీక్షల ఆవశ్యకతపై ఆవగాహన కల్పించినట్టు వ్యవసాయ శాఖ అధికారి R అక్బర్ బాషా తెలిపారు. రైతు భరోసా సిబ్బంది వారికి మట్టి నమూనాను తీసే విధానంపై పొలంలో క్షుణ్ణంగా వివరించారు. భూసార పరీక్షల ప్రయోజనాలను రైతులకు వివరించాలని రైతు భరోసా సిబ్బంది వారికి ఆదేశించారు. ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తద్వారా ఎరువులు వాడే విధంగా రైతులకు అవగాహన కల్పించారు.
రైతు సోదరులు తప్పనిసరిగా మీ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. శిక్షణానంతరం రైతు భరోసా సిబ్బంది ఒక్కొక్కరు రెండు మట్టి నమూనాలు చొప్పున సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
Bommireddypalli: భూసార పరీక్షలపై శిక్షణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES