వైసీపీ మద్దతుదారు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్(Borugadda Anil)కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని మండిపడింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కూడా కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందన్నారు.