Sunday, November 10, 2024
Homeఆంధ్రప్రదేశ్Botsa to be YCP candidate for MLC elections: ఉమ్మడి విశాఖ జిల్లా...

Botsa to be YCP candidate for MLC elections: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా బొత్స

ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. క్యాంప్‌ ఆఫీస్‌లో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో సమావేశమైన వైయస్‌ జగన్, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారితో మాట్లాడారు. అనంతరం బొత్స సత్యనారాయణను ఖరారు చేశారు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో క్యాంపు కార్యాలయంలో సమావేశమై, ఎమ్మెల్సీ ఎన్నిక అంశంపై చర్చించారు.

- Advertisement -

విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైయస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడదని, కాని చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి ప్రయత్నిస్తారన్నారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉన్నిక జరగబోతోందని, అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.


ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి వైయస్‌ జగన్‌ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్దేశించారు. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని, వాటిని థీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News