Tuesday, December 3, 2024
Homeఆంధ్రప్రదేశ్BR Naidu: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం

BR Naidu: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం

BR Naidu| టీటీడీ ఛైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు(BR Naidu) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది పాలకమండలి సభ్యులతో టీటీడీ ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ప్రధాన ఆలయం లోపలికి వెళ్లిని ఆయన.. ముందుగా భూవరాహ‌ స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు.

- Advertisement -

బీఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు అయిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జ్యోతుల నెహ్రు, ఎంఎస్‌ రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, కృష్ణమూర్తి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్‌ఎన్‌ దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, శాంతరామ్, రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్‌ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌కుమార్‌, డాక్టర్‌ అదిత్‌ దేశాయ్‌, సౌరభ్ హెచ్‌.బోరా, భానుప్రకాశ్‌ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News