బ్రహ్మగుండ క్షేత్రంలో శివరాత్రికి నాలుగు రోజులు జాతర జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా దొంగతనాలు దోపిడీలు జరగకుండా సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రం నలుమూలల సీసీ కెమెరాలతో నిరంతరం పరీక్షించనున్నట్టు యుగంధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బి. పెద్దిరెడ్డి ఆలయ అధికారి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
శనివారం శివరాత్రి సందర్భంగా ఇక్కడ జాగరణ మహోత్సవం, రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగనుంది. భక్తుల సౌకర్యార్థం వెల్దుర్తి నుంచి బ్రహ్మగుండంకు ప్రత్యేక ఉచిత బస్సులు నడుపుతున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.