Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Buggana: 10 కోట్లతో గ్రామాలకు తాగునీరు

Buggana: 10 కోట్లతో గ్రామాలకు తాగునీరు

పెళ్లైన నెలకే పిల్లలు కావాలన్నట్టు విపక్షాల విమర్శలు

ప్యాపిలి మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 350 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటింటికి తాగునీరివ్వనున్నట్లు మంత్రి బుగ్గన పునరుద్ఘాటించారు. వేల కోట్లతో ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే ప్రాజెక్టులను తీసుకువచ్చి, పూర్తి చేస్తున్నా ప్రతిపక్షాలు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నాయని మంత్రి అన్నారు. పెళ్లైన నెలకే పిల్లలు కావాలన్న చందంగా కరవుపై ప్రతిపక్షాల వైఖరి ఉందని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితులను విడతలవారీగా పరిశీలించి అధ్యయనం చేసి కరవును ప్రకటిస్తారన్న విషయం విపక్షాలకు తెలియదా అని ప్రశ్నించారు.

- Advertisement -

ప్యాపిలిలో డబుల్ రోడ్లు, పల్లెపల్లెకు రహదారులు, బస్ స్టాండ్, బస్ సేవల పెంపు అభివృద్ధి ఏనాడైనా ఊహించారా అని ప్రజలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామ్ రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ రాజనారాయణ మూర్తి, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ మెట్టు వెంకటేశ్వరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, చిన్న పూజర్ల రామచంద్రా రెడ్డి,ప్యాపిలి, జలదుర్గం ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News