బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో కొలువై ఉన్న శ్రీ మద్దిలేటీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ముఖద్వారమును 2 కోట్ల 75 లక్షలు రూపాయలతో ఆర్ఎస్. రంగాపురం గ్రామంలో, నూతన ముఖద్వారం నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి భూమిపూజ చేశారు.
తర్వాత బేతంచెర్ల పట్టణ పరిధిలోఉన్న డ్రైవర్స్ కాలనీలో 80 లక్షలు రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రారంభించారు.
తదనంతరం బేతంచెర్ల పట్టణంలో 29 లక్షలు రూపాయలతో గౌరీపేటలో నూతనంగా నిర్మించిన ఉర్దూ ప్రాధమికో న్నత పాఠశాలను మంత్రిబుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు బేతంచెర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బుగ్గన నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల నగరపంచాయితీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి శ్రీ మద్దిలేటీ స్వామి దేవాలయ పాలకమండలి చైర్మన్ బి. సీతారామచంద్రుడు, శ్రీ మద్దిలేటి స్వామి ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి. పాండురంగారెడ్డి, ఆలయ అర్చక సిబ్బంది ఆలయ నిర్వాహణ సిబ్బంది, వైసీపీ సీనియర్ నాయకులు బాబురెడ్డి, యామసాని జగన్ మోహన్ రెడ్డి, రంగాపురం రామమహేశ్వర రెడ్డి, బీరవోలు నాగేశ్వరరెడ్డి, గూని నాగరాజు వాల్మీకీ నాయకులు మురళీకృష్ణ, ఆకులరమణ, రామానాయుడు, రంగాపురం1టవ ఎంపీటీసీ బి. వెంకట లక్ష్మమ్మ,2 వ ఎంపీటీసీ నాగశేషులు, అంబాపురం ఎంపీటీసీ రామచంద్రారెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు మండల కో అప్షన్ సభ్యుడు ఎస్. రహంతుల్లా, మండల హాజీ నూర్ అహమ్మద్, మండల వైసిపి ముఖ్యనాయకులు ఎస్. ఖాజాహుసేన్, ఎస్. ముర్తుజా వలి, ముస్లీo నాయకులు, గొర్మానుకొండ గ్రామసర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, బలపాల పల్లె చిన్న ఎద్దులన్న, తిమ్మయ్య,బేతంచెర్ల నగర పంచాయితి కమిషనర్ రమేష్ బాబు, వార్డు కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.