Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: రాష్ట్రంలోనే ఉత్తమ కలెక్టర్ కార్యాలయంగా కర్నూలు

Kurnool: రాష్ట్రంలోనే ఉత్తమ కలెక్టర్ కార్యాలయంగా కర్నూలు

సివిల్ సర్వీస్ పరీక్షలు ఫ్రీ కోచింగ్

రాష్ట్రంలోనే కర్నూలు కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఉత్తమంగా ఉండేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్యపన్నుల నైపుణ్య అభివృద్ధి & శిక్షణ శాఖ మంత్రి జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ భవన మరమ్మత్తుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 8.8కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన కర్నూలు కలెక్టరేట్ భవనాన్ని గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖా మంత్రి మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల కిందట నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ఆధునీకరించి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, పరిపాలన మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనని పేర్కొన్నారు. అదే విధంగా సునయన ఆడిటోరియంను కంట్రీ క్లాస్ ఆడిటోరియం గా తయారు చేయడం జరుగుతుందన్నారు. రిపేర్స్, ఆధునికరణకు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, త్వరలో మరో 12 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ చుట్టూ ఉండే ఎ క్యాంప్ ప్రాంతాన్ని మోడ్రన్ ఏరియాగా తీర్చిదిద్దుతామన్నారు. ఏ-క్యాంప్ నుండి కలెక్టరేట్ ద్వారా వెళ్ళే రోడ్డు మార్గం ఏదైతే కనెక్టివిటీ అవసరమో అవన్నీ కూడా ప్రాపర్ మాస్టర్ ప్లానింగ్ డిజైన్ ప్రకారం చేయనున్నామని, డిజైన్ కూడా రాష్ట్రంలోనే బెస్ట్ ఆర్కిటెక్ట్స్ తో చేయించామన్నారు.

- Advertisement -

గ్రీనరీ, బ్యూటిఫికేషన్, పబ్లిక్ స్పేసెస్ తదితర అన్ని పనులను కూడా రెండు మూడు నెలల్లో పూర్తి అయ్యే లోపు కర్నూల్ కలెక్టరేట్ కాంప్లెక్స్ బ్రాండ్ న్యూ బిల్డింగ్ కాంప్లెక్స్ గానే కాకుండా కాంప్లెక్స్ చుట్టూ ఉన్న స్థలంతో రాష్ట్రంలోనే ఉత్తమంగా ఉండబోతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందనే ప్రశ్నలు వేసిన వారందరికీ ఇదొక నిదర్శనంగా నిలవబోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాల తర్వాత కర్నూల్ కలెక్టరేట్ కు మరొక కొత్త రూపం తీసుకొని వచ్చారన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ అనే వ్యవస్థ పరిపాలన మొత్తం జరిగేది ఇక్కడ నుండే అందుకే బ్రిటిష్ కాలం నుండి కలెక్టర్, తహసిల్దార్ కార్యాలయాలకు చాలా ప్రాముఖ్యత ఉండేదన్నారు. పరిపాలన యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎంత సిస్టమాటిక్ గా ఉంటుందో పరిపాలన కూడా ఆ విధంగా ఉంటుందనేది మనకు ఒక నిదర్శనమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల నుండి వచ్చిన ప్రతిభ గల విద్యార్థులకు ఉచితంగా సివిల్ సర్వీస్ పరీక్షలకు సంబందించిన కోర్సులు ఇవ్వడంతో పాటు హాస్టల్ వసతిని కల్పించిన ఏకైక కళాశాల సిల్వర్ జూబ్లీ కళాశాలని, ఆ కళాశాలను పీవీ నరసింహారావు స్థాపించారని, ఇప్పుడు ఆ కళాశాల శిధిలావస్థకు చేరిందని, మన ప్రభుత్వంలో జగన్నాథ గట్టు వద్ద సిల్వర్ జూబ్లీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని, స్థాపించినప్పటినుండే దాదాపుగా 750 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మీద ఎంతో చిత్తశుద్ధితో ఉందని కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఎంతో చక్కగా పరిపాలన చేశారన్నారు. రెండు సంవత్సరాలు కరోనా తో ఇబ్బంది పడాల్సి వచ్చిందని, ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తయ్యే సరికి ప్రతిదీ ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. గత కొంతకాలంగా వారానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు. తొలుత పునరుద్ధరించక ముందు ఉన్న కలెక్టరేట్ భవనాన్ని, 8 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన కలెక్టరేట్ భవనాన్ని ఫోటోల ద్వారా ఆర్థిక శాఖ మంత్రికి కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News