HomeTop StoriesTragedy: విశాఖలో కూలిన భవనం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Tragedy: విశాఖలో కూలిన భవనం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Building Collapsed in Visakha: విశాఖపట్నంలోని గాజువాక వికాస్‌ నగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఈ పాత భవనాన్ని జాకీల సహాయంతో పైకి ఎత్తే ప్రక్రియ చేపడుతుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మరణించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/temperatures-exceed-46-degrees-in-the-state/

శిథిలాల కింద చిక్కుకున్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని జేసీబీలతో శిథిలాలను తొలగించి బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News