Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: కమ్యూనిటీ కాదు కమిట్మెంట్ ముఖ్యం

Nandavaram: కమ్యూనిటీ కాదు కమిట్మెంట్ ముఖ్యం

టిడిపికి కేరాఫ్ బీవి కుటుంబం

మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీల సమావేశ కార్యక్రమంలో బిసి సెల్ ఉపాధ్యక్షులు ఈరన్న గౌడ్, మండల టిడిపి నాయకులు గురురాజ్ దేశాయ్, క్లస్టర్ ఇంచార్జ్ కాశిం వలి, మండల కన్వీనర్ చిన్న రాముడు మాట్లాడుతూ ఒక పార్టీలో ఒక వ్యక్తి కమ్యూనిటీని కాదు కమిట్మెంట్ ని చూడాలని వారు ప్రస్తావించారు.

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ తొలి రోజుల నుండి బివి కుటుంబం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, పార్టీ మనుగడ కోసం అహర్నిశలు కృషి చేస్తూ, పార్టీ ఆపద సమయంలో కూడా పార్టీకి అండగా ఉంటూ ఎనలేని సేవలందించిన కుటుంబం బీవి కుటుంబం అని వారు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు నుండి ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యువ నాయకులు లోకేష్ బాబు వరకు బీవీ కుటుంబానికి అత్యంత సాన్నిత్యము ఉన్నదని కావున పార్టీలోని కార్యకర్తలు గానీ నాయకులు గానీ అధైర్య పడాల్సిన అవసరం లేదు బి వి జయ నాగేశ్వర్ రెడ్డికే అధిష్టానం రాబోవు ఎన్నికలకు కచ్చితంగా టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుందని కార్యకర్తలకు భరోసా కల్పించారు. టిడిపికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కేరాఫ్ అడ్రస్ బీవీ కుటుంబమేనని ఇది పార్టీలోని పెద్దల నుండి ప్రతి కార్యకర్తకు క్షుణ్ణంగా తెలిసిన విషయమేనని వారు పేర్కొన్నారు.

ఈరోజు వచ్చే ఉదంతాలను నమ్మవలసిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. ఒకవేళ బివి జయ నాగేశ్వర్ రెడ్డికి కాకుండా మరో వ్యక్తికి అవకాశం కల్పిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి పార్టీ పెద్దలు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హెచ్చరించారు. ఈరోజు కొందరు ఆశావాదులు సొంత ప్రయోజనాల కోసం పార్టీలో సభ్యత్వం లేకున్నా కూడా పార్టీ టికెట్ను ఆశించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో సహా ప్రతి ఒక్కరి మద్దతు బివి జయ నాగేశ్వర్ రెడ్డికే ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ ధర్మపురం గోపాల్, గోపాల్ రెడ్డి, బాలరాజు, షరీఫ్, రహిమాన్, రాయచోటి రామకృష్ణారెడ్డి, నాగలదిన్నె ఈరన్న, మిట్టా సోమాపురం వీరేష్, ఐటిడిపి వీరేష్, వడ్డే గోపాల్, తిమ్మప్ప, శివ, రహిమాన్, మల్లికార్జున, వీరేష్, పంపయ్య, శీను, మల్లికార్జున గౌడ్, నరసింహులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News