విశాఖ ఉక్కు పరిశ్రమ(Vizag Steel Plant)కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు.. రూ.11,440 కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈమేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజీ కింద ₹11,440 కోట్లు కేటాయించదన్నారు. ఇందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
కాగా గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు. కేంద్ర పెద్దలను కలిసిన ప్రతిసారి ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తెస్తూ, ప్లాంట్‌ను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.