Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మరో రూ.3,300 కోట్లు విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కాగా, ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు రూ. 2,300 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read: https://teluguprabha.net/gallery/bellamkonda-sai-sreenivas-and-kavyas-wedding-in-tirumala/
పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో రూ. 3,300 కోట్ల నిధుల విడుదలకు అంగీకరించింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన రూ. 2,300 కోట్లకు అదనంగా, వచ్చే సెప్టెంబర్ నాటికి మరో రూ. 3,300 కోట్లు విడుదల చేసేందుకు జలశక్తి శాఖ అంగీకారం తెలిపింది. దేశ రాజధానిలో జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయడంపై చర్చ జరిగింది. అదేవిధంగా ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ముంపు ప్రభావంపై కూడా సమన్వయం చేసుకున్నారు. ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నిర్మించడానికి తదుపరి కార్యాచరణను రూపొందించినట్లు సాయి ప్రసాద్ తెలిపారు.

