ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో భూమా విఖ్యాత్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తొమ్మండ్రు గురుకుమార్ కుటుంబాన్ని, ఆనారోగ్యంతో ఉన్న తొమ్మండ్రు రామరాజు, కొద్ది రోజుల కింద గుజరాత్లో చదువుతూ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కామిశెట్టి మధు కుమారుడు సాయి దీరజ్, అనారోగ్యంతో మరణించిన అజిమొద్దిన్, దూదేకుల మోటార్ సైకిల్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన దూదేకుల టైలర్ చిన్న, ముత్యాలపాడు ఫరీద, గత కొన్ని రోజులుగా ఎస్సీ కాలనీలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన బోడేల్లా నరసమ్మ. సుబ్బరాయుడు, ఆంధ్రప్రభ విలేఖరి శివకుమార్ గుండెపోటు రావడంతో కర్నూలు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, వారి ఇంటికి వెళ్లి వారి అమ్మగారిని పమర్శించి ధైర్యం చెప్పి, హాస్పిటల్ డాక్టర్స్ తో నేను మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి చాగలమర్రిలోని తెలుగుదేశం పార్టీ, భూమా కార్యకర్తలకు అందరికీ అన్ని విదాలుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు అన్సర్ భాష, నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ స్పోకెన్ పర్సన్ సల్లా నాగరాజు, టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహుడు, కొలిమిషరీఫ్, అలంసా గారి మౌలాలి, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి హనీఫ్, వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు శంకర్ సుబ్బారావు, కామిశెట్టి రమేష్, మల్లెం శ్రీను, బుడ్డపై గారి షరీఫ్ రఫీ దిన్, క్లస్టర్ ఇంచార్జి అజీమ్, దూదేకుల పెద్ద లాలయ్య, గఫర్, ఆకుల ఇర్షాద్, షాబుల్, కశినేని ఓబులేసు టైలర్ భాష, చోటు, వెంకటయ్య కొట్టే రమణ, నాగార్జున, మోహన్ తదితరులు పాల్గొన్నారు.