ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నిన రాష్ట్ర ప్రజల మద్దతు ముఖ్యమంత్రి జగనన్నకే పుష్కలంగా ఉందని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజింద్రారెడ్డి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చాగలమర్రిలోని 19, 20వ వార్డు గుంతపాలెంలో ఆయన ‘గడప గడపకు మన ప్రభుత్వ’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకోగానే వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. కొందరు ఇంటి స్థలాలు తమకు రాలేదని ఫిర్యాదు చేయగా రెండవ విడతలో తప్పనిసరిగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు వీరభద్రుడు , ఉప సర్పంచ్ సోహెల్, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, మండల కో ఆప్షన్ సభ్యులు జిగ్గి గారి ఇబ్రహీం , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముల్లా జాబిర్ ,ఎంపీటీసీ ఫయాజ్ , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి , సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి, వార్డు సభ్యులు ముల్లా బ్రాందీన్, పెయింటర్ షరీఫ్ , ఎంపీడీవో మహమ్మద్ దోలా, డిటి విజయకుమార్ , ఏఈలు ముల్లా షాజహాన్ , సలీం, షఫీవుల్లా, ఏవో రంగ నేతాజీ , ఈవో సుదర్శన్ రావు , హెల్త్ సూపర్వైజర్ రామలింగారెడ్డి , గ్రామ సచివాలయ సిబ్బంది , ఆయ వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు టోపి భాష, పప్పీ, లడ్డు భాష , జల్సా గౌస్, ఖాదర్ బాషా , కొండయ్య, సాదిక్, గేట్ల మహబూబ్ సాబ్ , ముల్లా ఖాదర్ బాషా , వెంకటరమణ, దేవేంద్రారెడ్డి , రమేష్, మదార్ వలి , ఆర్ఎస్ రమణ , రామకృష్ణ మెడికల్ స్టోర్ నాగేంద్ర , ఐడియా బాబు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అబ్దుల్లా పాల్గొన్నారు.