Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri: చాగలమర్రిలో కృష్ణాష్టమి వేడుకలు

Chagalamarri: చాగలమర్రిలో కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణుడు, రాధమ్మ వేషధారణలో చిన్నారులు

చాగలమర్రిలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా 7వ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి నిర్వహించే శ్రీ కృష్ణ భగవాన్ గ్రామోత్సవం చాగలమర్రి శివరామ నంద ఆశ్రమం నుండి పట్టణ పురవీధుల గుండా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, సల్లా నాగరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం అందరూ సహకరించాలని ఆయన కోరారు. వీరంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, గుత్తి నరసింహులు, రామ సుబ్బారెడ్డి, హేమకరాయరెడ్డి, ప్రసాద్, కొండయ్య, దామోదర్ శ్రీనివాసులు, చక్రపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News