Tuesday, October 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri: ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష

Chagalamarri: ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష

ఇంటింటికీ సర్వే మొదలు

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న చాగలమర్రి-3 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సిబ్బంది ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సురేంద్ర బాబు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి జల్లెడ విధానంలో ఆరోగ్య సమస్యలు తెలుసుకుని తదుపరి వివరాలను యాప్ లో పొందుపరిచే సర్వే కార్యక్రమం 20 రోజులు పాటు సాగుతుందని తెలియజేశారు. సర్వేలో వివరాలను సేకరించడంతో పాటు అవసరాన్ని బట్టి ఇంటివద్దె బిపి, షుగరు, హిమోగ్లోబిన్, యూరిన్, మలేరియా, డెంగ్యూ, ప్రెగ్నెన్సీ వంటి పరీక్షలు హెల్త్ క్లినిక్ సిబ్బంది నిర్వహించి, టోకెన్లు పంపిణీ చేస్తామని, సర్వే పూర్తయిన పిమ్మట అక్టోబర్ నెల,17వ తేదీన చాగలమర్రి గ్రామంలో, మూడవ సచివాలయం దగ్గర జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ జరుగుతుందని, ఈ క్యాంప్లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఒక గైనకాలజిస్ట్ , ఒక జనరల్ ఫిజిషియన్ అందుబాటులోకి ఉంటారని , క్యాంప్ లో అన్నిరకాల పరీక్షలు, మందులు ఉచితంగా లభిస్తాయని, ఈ అవకాశాన్ని చాగలమర్రి గ్రామస్తులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ సురేంద్ర బాబు ఆశా కార్యకర్తలు శాంత కుమారి, వాలంటీర్లు శశికళ, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News