Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Chaganti: సోషల్ మీడియాను మంచిగా వాడుకుందాం.. చాగంటి సందేశం

Chaganti: సోషల్ మీడియాను మంచిగా వాడుకుందాం.. చాగంటి సందేశం

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు వినూత్నంగా ప్రచారం చేపట్టింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, ప్రచారాలతో జరిగే నష్టంపై తెలియజేసేలా అవగాహన కార్యక్రమం చేపట్టింది. చెడు చూడకు, మాట్లాడకు, వినకు అని సూచించే కోతి బొమ్మలను ముద్రించిన హోర్డింగులను ఏర్పాటు చేసింది. అలాగే ప్రముఖుల ద్వారా కూడా అవగాహన కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త, ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశం ఇచ్చారు.

- Advertisement -

‘‘సోషల్ మీడియాను మంచి కోసం వినియోగిద్దాం. అసత్య ప్రచారాలు, దూషణలు చేయవద్దు. ఒకరిని పరుషంగా మాట్లాడవద్దు, వాళ్లు కూడా అంతే పరుషంగా మాట్లాడితే ఎంత బాధ కలుగుతుందో అర్ధం చేసుకోవాలి. మనం అనే మాటలతో ఎదుటి వారు బాధపడతారని తెలిసినప్పుడు అలా అనడం ఎందుకు?, తము చేసే పనులతో ఎదుటి వాడిని దు:ఖించొద్దు. చెడు కలుగుతుందని తెలిస్తే వెంటనే ఆపేయండి. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. సమస్త భూమండలంలో మాట్లాడగలిగే జీవ రాశి ఒక్క మానిషి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మనిషి మాట్లాడే ప్రతి వాక్కు ఎదుటి వాడిని సంతోషింపజేయాలి. వారి మనసులు గాయపర్చేలా మాట్లాడవద్దు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో మంచి పనులకు మాత్రమే వాడుకోవాలి. తప్పుగా మాట్లాడి ఇతరుల మనస్సులను గాయపర్చొద్దు. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి అసభ్య పోస్టులు అసలు పెట్టవద్దు. ప్రతి ఒక్కరూ తమను తాము నియంత్రించుకోవాలి. సభ్యత, సంస్కారాలు చాటుకోవాలి.’’ అని సూచించారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad