Homeఆంధ్రప్రదేశ్APSRTC: ఆ పథకంతో ఆర్టీసీపై భారం.. ప్రైవేట్‌ భాగస్వామ్యం తప్పనిసరి- ఛైర్మన్‌ నారాయణ

APSRTC: ఆ పథకంతో ఆర్టీసీపై భారం.. ప్రైవేట్‌ భాగస్వామ్యం తప్పనిసరి- ఛైర్మన్‌ నారాయణ

APSRTC Electric Buses: ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రైవేట్ ఆపరేటర్ల భాగస్వామ్యం తప్పనిసరి అని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈమేరకు అమరావతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/rangareddy-news/brutal-murder-of-two-elderly-women-near-moinabad-farmhouse/

ఆర్టీసీపై ఆర్థిక భారం

రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో ప్రైవేట్‌ ఆపరేటర్ల భాగస్వామ్యం ప్రాధాన్యతపై నారాయణ పలు కారణాలు వెల్లడించారు. సంస్థలోని సుమారు 10,000 పాత డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉందని చెప్పారు. వీటన్నింటి కొనుగోలుకు దాదాపు రూ. 15,000 కోట్ల నుంచి రూ. 17,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ‘స్త్రీ శక్తి’ పథకం వంటి కారణాల వల్ల ఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిందని.. తద్వారా ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొత్త బస్సులు కొనే స్తోమత సంస్థకు లేదని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వాడుకుంటూ, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా బస్సులు నడపడమే సంస్థకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఎలక్ట్రిక్‌ బస్సుల పరిస్థితి

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సుల అమలులో తొలి దశలో భాగంగా 1,050 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. అందులో 750 బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని ఛైర్మన్‌ నారాయణ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. రాబోయే 2 నుంచి 3 నెలల్లో ఈ ఈవీ బస్సులు రోడ్లపైకి వస్తాయని వెల్లడించారు. కాలం చెల్లిన పాత డీజిల్ బస్సులను దశలవారీగా స్క్రాప్‌కు పంపిస్తూ, వాటి స్థానంలో ఈ కొత్త విద్యుత్ బస్సులను ప్రవేశపెడతారని వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/land-rates-in-telangana-soar-in-telangana/

ప్రయాణికులపై భారం ఉండదు.. 

ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలులో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగినప్పటికీ, ప్రస్తుతానికి ఆర్టీసీ టికెట్ ధరలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఏదీ లేదని నారాయణ క్లారిటీ ఇచ్చారు. డీజిల్ బస్సుల వల్ల కిలోమీటరుకు రూ. 16 ఖర్చవుతుంటే, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆ ఖర్చు కేవలం రూ. 7 కి తగ్గుతుందని..  దీనివల్ల భవిష్యత్తులో ఆర్టీసీపై డీజిల్ ధరల ప్రభావం ఉండదని తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News