Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Chalo Hyd: బహుజనులంతా తరలి రావాలి

Chalo Hyd: బహుజనులంతా తరలి రావాలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను, నిరుద్యోగ యువకులను వంచనకు గురిచేయడం వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగిత తాండవిస్తుందని ఇది ముమ్మాటికి పాలకుల వైపల్యమేనని బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ లింగాల స్వాములు అన్నారు. పట్టణంలోని స్థానిక కాన్షిరాం సర్కిల్ లో బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు ఆధ్వర్యంలో 7 న ‘చలో హైదరాబాద్’ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం నాయకులు లింగాల స్వాములు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం పేరిట అనేక పథకాలు పేరుకు మాత్రమే ప్రవేశపెట్టి బహుజన ప్రజల బతుకులను చిన్న భిన్నం చేశారని, నిరుద్యోగ యువకులను వంచించిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుందని విమర్శించారు. నాటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ అధికారంలోకి వచ్చాక జాబ్ కేలండర్ ఊసే ఎత్తలేని పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

- Advertisement -

ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట బటన్ నొక్కుడు కార్యక్రమాలతో చిల్లర నగదు జమ చేస్తూ బహుజన ప్రజల బ్రతుకులను చిల్లర బ్రతుకులుగా మార్చిన చరిత్ర ఈ ప్రభుత్వాన్నిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగిత తాండవిస్తుందని ఇది ముమ్మాటికి జగన్ ప్రభుత్వం నిరుద్యోగ యువకులను మోసం చేయడమేనన్నారు. మాట తప్పను మడమ తిప్పనన్న ముఖ్యమంత్రి నేడు జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ ప్రశ్నించారు. 10% జనాభా లేనివారు రాష్ట్రాలను పరిపాలిస్తుంటే 90 శాతం ఉన్న బహుజనులు బానిస బ్రతుకుల్లాగా, ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా బ్రతుకుతున్నారన్నారు. మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరాం చూపిన మార్గం ” ఓటు మాదే సీట్లు మావే “అనే నినాదంతో దేశంలో బిఎస్సి పార్టీ బెహన్ జి మాయావతి నాయకత్వంలో పనిచేస్తుందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాధికార దిశగా బహుజనులే పాలకులు కావాలనే నినాదంతో హైదరాబాదు మహానగరంలోనే సరూర్నగర్ లో ఈనెల 7వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి బెహన్ జీ కుమారి మాయావతి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు అన్నారు. ఈ సభకు బహుజన ప్రజలంతా ఏకమై రాజ్యాధికార సాధనకై జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని వారి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు రవి, శేషన్న, లడ్డు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News