Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandra Babu: టీచర్ అవతారమెత్తిన సీఎం చంద్రబాబు..స్టూడెంట్స్‌కి స్పెషల్ క్లాస్

Chandra Babu: టీచర్ అవతారమెత్తిన సీఎం చంద్రబాబు..స్టూడెంట్స్‌కి స్పెషల్ క్లాస్

Chandra Babu: మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇందులో భాగమయ్యారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా తల్లీదండ్రులు, టీచర్స్‌తో కలిసిన సీఎం చంద్రబాబు.. పిల్లల చదువు కొనసాగుతున్న తీరుపై ఆరా తీశారు. ఆ తర్వాత విద్యార్థులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి.. వారివారి భవిష్యత్‌ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువులో బాగా రాణించి దేశంలోని ఉన్నత ఉద్యోగాలను సాధించాలని వారికి మార్గనిర్దేశం చేశారు. పేరెంట్స్‌తో మాట్లాడిన అనంతరం ఓ తరగతికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.

- Advertisement -

ఇప్పటి వరకు పేరెంట్ టీచర్ మీటింగ్‌ అనేది కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అప్లై చేస్తూ ఆదేశారు జారీ అయ్యాయి. గతేడాది డిసెంబర్ 7న జరిగిన తొలి పేరెంట్ టీచర్స్ మీటింగ్ విజయవంతమైంది. ఆ తర్వాత  రెండోసారి శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులే కాకుండా పాఠశాల యాజమాన్య కమిటీలు అందుకు సంబంధించిన ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులను కలుపుతూ.. ఇలా ఒకే రోజున 2 కోట్ల 28 లక్షల మందిని కలిపి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. ఈ మెగా పీటీఎం 2.0ను ఒక ఉత్సవంలా జరుపుతున్నారు. చదువులో పిల్లల పురోగతి ఎలా ఉంది? వారి ప్రవర్తన, సామాజిక అంశలపై తల్లీదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశమే ఈ మీటింగ్ ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా తల్లీదండ్రులు కూడా వాళ్ల అభిప్రాయాలు, సూచనలను ఈ వేదికగా పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా ఇదే విధంగా పేరెంట్స్ టీచర్స్ మధ్య ఆత్మీయ సమావేశం జరగాలనేని కూటమి ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad