Friday, January 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఎన్ని కోట్ల ఆస్తులంటే..?

Chandrababu: దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఎన్ని కోట్ల ఆస్తులంటే..?

దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ. 36 కోట్ల ఆస్తులు ఉండగా భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొంది. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.931 కోట్లు.. అప్పు రూ.10కోట్లుగా ఉందని తెలిపింది.

- Advertisement -

ఇక రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ(రూ.332కోట్లు) ఉన్నారు. ఆయన పేరిట అత్యధికంగా రూ.180 కోట్ల అప్పు కూడా ఉందని తెలిపింది. ఇక మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ. 51 కోట్లు కాగా.. అప్పు రూ.23 కోట్లగా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేరిట రూ.30.32కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రూ.55 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రూ. 1.18 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చెప్పింది. అత్యల్పంగా కేవలం రూ. 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అట్టడుగున నిలిచారు. కాగా దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ. 1,630 కోట్లుగా ఉందని ADR నివేదిక వివరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News