టీడీఎల్పీ(TDLP) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో అప్రమత్తంగా లేక 2019 ఎన్నికల్లో నష్టపోయామని గుర్తుచేశార. వివేకా హత్య, కోడికత్తి డ్రామాలు టీడీపీ మీద వేశారని వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా జగన్ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు.


ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. అందుకే పోలీసులు సీసీ ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో నేతలతో సమన్వయం చేసుకోవాలని.. గ్రూపులు పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు.

