Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి ఆలింగం.. వీడియో వైరల్

Chandrababu: తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి ఆలింగం.. వీడియో వైరల్

మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు(Daggubati Venkateswara rao) రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. తోడల్లుళ్లు అయిన చంద్రబాబు, దగ్గుబాటి ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -

ఇక ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. తనకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారని అది నిజమే అని తెలిపారు. కానీ ఇప్పుడు కాదని ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాలానికి అనుగుణంగా మారాలని ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలని వెల్లడించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ వద్ద దగ్గుబాటి, తాను రాజకీయాలు నేర్చుకున్నామని తెలిపారు. ఆయన పుస్తకం రాస్తారని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి చొరవను అందరం చూశామని.. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.

https://twitter.com/JaiTDP/status/1897532495848989103
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News