HomeTop StoriesPM Modi: చంద్రబాబు, పవన్‌ల నివాసాలకు ప్రధాని మోదీ.. ఈ క్షణాలు చిరస్మరణీయమంటూ ఇరు నేతల...

PM Modi: చంద్రబాబు, పవన్‌ల నివాసాలకు ప్రధాని మోదీ.. ఈ క్షణాలు చిరస్మరణీయమంటూ ఇరు నేతల ట్వీట్‌

CBN, Pawan Tweet: ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. జూబ్లీహిల్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నివాసాలకు వెళ్లి వారిని కలుసుకున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు ప్రధానికి ఆత్మీయ ఆహ్వానం పలికాయి. ఈ రోజు తమ జీవితంలో చిరస్మరణీయమైనదని.. ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు, పవన్‌ ట్వీట్ చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/kcr-to-meet-with-key-brs-leaders/

Modi CBN

ఈ రోజు తమ నివాసానికి ప్రధాని మోదీ విచ్చేయడం.. తమ కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక చిరస్మరణీయ సాయంత్రమని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా, ఆనందంగా ఉందని.. ఆయన ఆప్యాయత, అనురాగం, ఉదారమైన సంభాషణ ఈ సందర్భాన్ని తమందరికీ నిజంగా ప్రత్యేకంగా చేశాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ఆయన అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతు పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: https://teluguprabha.net/telangana/kishan-reddy-comments-on-rrr-works/

PM Modi Pawan home

ప్రధాని నరేంద్ర మోదీ తమ నివాసానికి వచ్చి పరామర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందని పవన్‌ కళ్యాణ్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు విచ్చేయడం.. ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొనియాడారు. ఆయన చూపిన ఆదరణను ఎప్పటికీ గుర్తంచుకుంటానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News