వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్(Jagan) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమ అధినేతకు శుభాకాంక్షలు చెబుతూ ఊరువాడా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు(CM Chandrababu)కూడా జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కని ఆరోగ్యం, సుదీర్గ జీవితం ఉండాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.
రాజకీయాల్లో జగన్, చంద్రబాబు ఉప్పు, నిప్పుగా ఉండే సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే విషయం విధితమే. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్‌ను చంద్రబాబు విష్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా గతంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.