CM Quantum cabinet meeting : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన ‘మొంథా’ తుపాను సమయంలో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేశారంటూ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
ALSO READ: Mali Tiktok Star Murder : మాలిలో ఉగ్రదాడి! టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య
మెంథా తుఫాను సమయంలో మంత్రులు చేపట్టిన సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. “మీరు ప్రజలకు అందుబాటులో ఉండి, తక్షణ సహాయం అందించారు. టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తేనే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి” అని మంత్రులకు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 1.5 లక్షల మందికి ఆహారం, నీరు, వస్త్రాలు అందించామని, ఆర్టీజీ సెంటర్‌లు, డ్రోన్‌లు, సాటిలైట్ ట్రాకింగ్‌లతో నష్టాన్ని తగ్గించామని చంద్రబాబు గుర్తు చేశారు.
సమావేశంలో 70కు పైగా అంశాలపై చర్చించారు. మొంథా తుపాను నష్టం అంచనా, బాధితులకు పరిహారం, పునర్నిర్మాణంపై ప్రధానంగా మాట్లాడారు. తుపాను వల్ల 12 జిల్లాల్లో 2 లక్షల ఎకరాలు పొలాలు, 5 వేల ఇళ్లు, 500 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పరిహారంగా రూ.2,000 కోట్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామాల్లో మొక్కలు, కట్టడాలు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
పెట్టుబడుల సదస్సుపై దృష్టి – విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీలు జరిగే సీఐఐ సదస్సును విజయవంతం చేయాలని మంత్రులకు సూచించారు. “రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 3 వేల మంది పెట్టుబడిదారులు, 50+ దేశాల రాయబారులు వస్తున్నారు” అని చంద్రబాబు తెలిపారు. సదస్సు ద్వారా 50 వేల ఉద్యోగాలు, ఐటీ, టూరిజం, గ్రీన్ ఎనర్జీలో MoUలు రాబోతున్నాయని, మంత్రులు తమ శాఖల్లో బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.


