Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: టెంపుల్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu: టెంపుల్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి(Tirupathi)లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు(International Temple Conference)ను ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రారంభించారు. ఈ సదస్సుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్(Fadnavis), గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌, ఆర్‌ఎస్ఎస్‌ ప్రతినిధి సీఆర్‌ ముకుంద్‌ పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

టెంపుల్ మేనేజ్మెంట్‌కు సంబంధించి కొత్త విధానాలు, ఉత్తమ పద్ధతులు అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం, డిజిటలైజేషన్‌, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించే వ్యూహాలే లక్ష్యంగా ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో (ITCX) సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ, ఆధ్యాత్మిక సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా ఎక్స్‌పోతో కనెక్ట్‌ కానున్నన్నారు. ఈ సదస్సులో కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad