పట్టణ టిడిపి అభ్యర్థి ఎవరన్నది ప్రజల్లో తెలియక తికమకగా ఉండేది. కే.ఈ వర్గానికి అని కొందరు కోట్ల వర్గానికి అని కొందరు కొత్తగా టిడిపి ఇన్చార్జ్ అయిన సుబ్బారెడ్డి కి అని కొందరు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్న లాగా మిగిలిపోయింది. నిన్న రాత్రి ప్యాపిలీ లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించారు. జలదుర్గంను మండలం చేస్తాను, గుండాల గ్రామంలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తానని చంద్రబాబు హామీ. ఆర్ధిక మంత్రి బుగ్గన పిట్ట కథలతో కాలం గడుపుతున్నాడు అప్పుల కోసం చిప్ప పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక ధర్మవరం సుబ్బారెడ్డిని గెలిపించుకోండి మీకు అందుబాటులో ఉంటాడు మీ ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్తాడు అని తెలియజేశాడు. చంద్రబాబు నాయుడు చేసిన వాక్యాల వల్ల కే.ఈ వర్గం కోట్ల వర్గం నిరాశ చెందారు. అసలు డోన్ నియోజకవర్గ అంటే కే.ఈ, కోట్ల కుటుంబానికి కంచుకోటగా భావించే వాళ్ళు. అలాంటిది ఇరువర్గాలకు కాకుండా మూడో వ్యక్తి అయినా ధర్మవరం సుబ్బారెడ్డి టికెట్ ప్రకటించడం తో కేఈ, కోట్ల కుటుంబాల ప్రస్థానం డోన్ లో ముగిసినట్టేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.
కే.ఈ కుటుంబీకులు డోన్ నియోజకవర్గాన్ని పట్టించుకోని అభివృద్ధి చేసి ఉంటే, అందరికీ అండగా ఉండి ఉంటే ఇంకో వ్యక్తికి టికెట్ వచ్చేది కాదని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డి టికెట్ ఇవ్వడం తో బీసీ వర్గాలు డీలా పడిపోయారు. బీసీ నాయకులంతా సుబ్బారెడ్డికి టిడిపి టికెట్ ఇచ్చి చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. టిడిపి అధినేత అసలు వ్యూహం ఏంటి రెడ్డి వర్సెస్ రెడ్డి అని ఎందుకు ప్రకటించారు. దీనికి గల కారణాలేంటి అంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. టిడిపి అభ్యర్థి సుబ్బారెడ్డికి కే.ఈ కోట్ల వర్గం మద్దతిస్తుందా..? లేదా..? అంటూ డోన్ నియోజకవర్గం ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ కె.ఈ, కోట్ల వర్గం సుబ్బారెడ్డికి మద్దతిస్తే అప్పుల మంత్రి బుగ్గన్నకు ఇంకా చుక్కలే ప్రజలు చెబుతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుంది తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.