Homeఆంధ్రప్రదేశ్CBN : పేదరికం లేని సమాజమే నా శ్వాస... అప్పుల ఊబి నుంచి నవశకం వైపు...

CBN : పేదరికం లేని సమాజమే నా శ్వాస… అప్పుల ఊబి నుంచి నవశకం వైపు ఆంధ్రప్రదేశ్!

AP State Finance White Paper : రాష్ట్ర విభజన సమయం నుంచి నేటి వరకు జరిగిన ఆర్థిక స్థితిగతులను శ్వేతపత్రం ద్వారా క్షుణ్ణంగా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.95,231గా ఉన్న తలసరి ఆదాయం, విభజన అనంతరం తెలంగాణలో రూ.1,24,104 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.93,903గా నమోదైందని చెప్పారు.

- Advertisement -

గత వైఎస్సార్సీపీ పాలనలో (2019-24) పాటించిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్ర Gross State Domestic Product (GSDP) వృద్ధిరేటు 3.18 శాతం క్షీణించిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృద్ధిరేటు తగ్గుదల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.6.94 లక్షల కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూసిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ నివేదికలు సైతం గత ప్రభుత్వ కాలంలో జరిగిన తీవ్రమైన ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎత్తిచూపాయని పేర్కొన్నారు.

రూ. 8,600 కోట్ల పొదుపు… కఠిన ఆర్థిక క్రమశిక్షణ : ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కఠిన నిర్ణయాలు తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికి రూ.48,616 కోట్లుగా ఉన్న పెండింగ్ బిల్లుల భారాన్ని, సమర్థవంతమైన నిర్వహణ ద్వారా రూ.29,259 కోట్లకు తగ్గించగలిగారు. అధిక వడ్డీలకు తెచ్చిన 370 రకాల రుణాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు జరిపి వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా రూ.1,100 కోట్లను ఆదా చేశారు. పరిపాలనా వ్యయాన్ని తగ్గించడం, వృథాను అరికట్టడం ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.8,600 కోట్లు పొదుపు చేశామని వెల్లడించారు.

బ్రాండ్ ఆంధ్రా’ పునరుద్ధరణ… భోగాపురం ఒక దిక్సూచి : “మూడు రాజధానుల ముసుగులో పెట్టుబడిదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. ఏ ఒక్క అంతర్జాతీయ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్‌వైపు చూడని పరిస్థితి కల్పించారు” అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ‘బ్రాండ్ ఆంధ్రా’ పునర్వైభవాన్ని సంతరించుకుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల శరవేగ పూర్తవుతుండటమే ఇందుకు సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. భోగాపురం ప్రాజెక్టును భవిష్యత్తు అవసరాలకు అనుసంధానించే అంతర్జాతీయ గేట్‌వేగా తీర్చిదిద్దుతున్నామని, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR)ను 13.5 శాతం స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News