Homeఆంధ్రప్రదేశ్Kuppam TDP: కుప్పంలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం.. ఇకపై పీఏగా కంచర్ల శ్రీకాంత్‌

Kuppam TDP: కుప్పంలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం.. ఇకపై పీఏగా కంచర్ల శ్రీకాంత్‌

Kuppam TDP CBN: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆదివారం అమరావతిలో కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక భేటీలో చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 

- Advertisement -

ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను చంద్రబాబు తప్పించారు. ఆయన సేవలను ఇకపై రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు.. తన పీఏగా నియమించుకున్నారు. ఈ మేరకు శ్రీకాంత్‌ ఇకపై సీఎం కార్యాలయం నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే మరో నేతను కుప్పం పార్టీ కార్యకలాపాల బాధ్యతల్లోకి తీసుకువచ్చినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఇకపై తానే స్వయంగా అన్నీ చూసుకుంటానని ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని, త్వరలోనే తాను కుప్పంలో పర్యటిస్తానని ఈ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News