AP MSME parks inauguration : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెద్దైర్లపాడులో MSME పార్క్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో “ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త ఉండాలనేదే మా లక్ష్యం. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం మా బాధ్యత” అని ప్రకటించారు.
ALSO READ: Weekend: బాక్సాఫీస్ హీట్ పెంచబోతున్న నవంబర్ 14 రిలీజ్‌లు!
కనిగిరి MSME పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యవసాయ ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలు తయారు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 MSME పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తూ, 184 పార్కుల్లో 1,000 ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సీఎం చంద్రబాబు కనిగిరిలో 329 ఎకరాల్లో 15 MSME పార్కులు ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 పార్కులకు పునాది రాయి వేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయునపల్లిలో చేనేత పార్కుకు కూడా వర్చువల్ శంకుస్థాపన చేశారు. “రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. వాటిని అభివృద్ధి చేసి తిరిగి ఇస్తున్నాము. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర వనరులను సద్వినియోగం చేసుకుని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకువస్తున్నామని తెలిపారు.
పెట్టుబడులు తీసుకువచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీపై చర్చించారు. “కొందరు అవహేళన చేశారు. కానీ, ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ వారం ఏపీలో పెట్టుబడుల వర్షం కురుస్తోంది..చూడండి” అని తెలిపారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారని విమర్శించారు. MSME పార్కులు MSMEsకు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) భూమి, సబ్సిడీలు, లోన్‌లు అందిస్తాయి. ఇవి 10 వేల ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు.
చంద్రబాబు తన పాలనలో MSMEలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2014-19 మధ్య 1,000 MSME పార్కులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 50 పార్కులు ప్రారంభించి, మహిళల సాధికారతపై దృష్టి పెట్టింది. లక్ష మంది మహిళలకు ట్రైనింగ్‌లు, లోన్‌లు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు ఇన్నోవేట్ చేసి కొత్త పరికరాలు తయారు చేయాలని సూచించారు.


