Wednesday, December 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu-PawanKalyan: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్‌ భేటీ

Chandrababu-PawanKalyan: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్‌ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ ముగిసింది. సచివాలయంలో దాదాపు 40 నిమిషాల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా మంత్రిగా నాగబాబు(Nagababu) ప్రమాణ స్వీకార తేదీ ఖరారుపై చర్చించినట్లు సమాచారం. అలాగే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించాలని సూచించారట. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

- Advertisement -

తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పార్టీల్లో చేరికలపై ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద నాయకులను చేర్చుకోకపోవడమే ఉత్తమం అని డిసైడ్ అయ్యారట. అలాగే మిగిలిన నామినేటెడ్ పదవులకు తుది జాబితా రూపకల్పనపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. కాగా నాగబాబుకు రాజ్యసభ సీటు వస్తుందని అనుకున్నారు. అయితే బీజేపీ నుంచి ఆర్ .కృష్ణయ్యకు సీటు ఇవ్వాల్సి రావడంతో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News