మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షులు శ్రీనివాసుల రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి వరుసగా చనిపోవడంపై చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ హరీష్ గుప్తా వివరించారు.
ఈ సందర్భంగా కేసు సీబీఐ పరిధిలో ఉన్నా సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు తెలిపారు. సాక్షుల అనుమానాస్పద మృతి దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జగన్(Jagan) కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెబుతూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలానే చనిపోతూ వచ్చారని ఆయన గుర్తు చేశారు.