Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Intermediate exams: ఇంటర్ పరీక్షల్లో మార్పులు.. సైన్స్ విద్యార్థులకు ఊరట!

Intermediate exams: ఇంటర్ పరీక్షల్లో మార్పులు.. సైన్స్ విద్యార్థులకు ఊరట!

Changes in Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానున్నాయి. ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫస్టియర్ పరీక్షల్లో 29 మార్కులు, సెకండియర్ పరీక్షల్లో 30 మార్కులు సాధిస్తే సరిపోతుంది. రెండేళ్లు కలిపి 59 మార్కులు వస్తే పాస్ అయినట్లేనన పేర్కొంది. ఈ మార్పుల వల్ల విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతుందని విద్యాశాఖ పేర్కొంది. ఇంతకుముందు ఇంటర్ ఫస్టియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు 85 మార్కులకు రాతపరీక్ష ఉండేదని పేర్కొంది. పాస్ అవ్వడానికి 35% మార్కులు అంటే 29.75 మార్కులు రావాల్సి ఉండేది. అయితే.. ఇప్పుడు ఈ మార్కులను 29కి తగ్గించారు. అంటే ఫస్టియర్‌లో 29 మార్కులు తెచ్చుకుంటే సరిపోద్ది. సెకండియర్‌లో సైతం ఇదే విధానాన్ని అనుసరించారు. అక్కడ 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలనే పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు కలిపి చూసుకుంటే.. మొత్తం 35% మార్కుల కింద 59.50 మార్కులు సాధించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈ మార్కులను 59కి తగ్గించారు. అనగా అర మార్కు తగ్గించి విద్యార్థులకు ఊరట కల్పించారు.

- Advertisement -

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-foreign-tour-starts-from-today/

జాగ్రఫీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు :సైన్స్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ ఉన్న పరీక్షల్లో అర మార్కు సడలింపు ఇస్తూ..విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకనుంచి ఇంటర్ రెండేళ్లు పరీక్షల్లో కలిపి అర మార్కు తక్కువ వచ్చినా విద్యార్థులను పాస్ చేస్తారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టుల రాత పరీక్షల్లో అర మార్కు తక్కువ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదని విద్యాశాఖ పేర్కొంది. ఎందుకంటే.. ఇంటర్‌ విద్యా మండలి ఈ విషయంలో సడలింపు ఇచ్చింది. ఈ అర మార్కును సెకండియర్ ప్రాక్టికల్స్‌లో సర్దుబాటు చేయనున్నారు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌తో పాటు పరీక్షల్లోనూ ఈ సంస్కరణలను తీసుకువచ్చారు. ఇంటర్‌ విద్యా మండలి ఈ కొత్త విధానంపై కాలేజీలకు ఇప్పటికే సమాచారం పంపింది. కొత్త విద్యా విధానంలో భాగంగా జాగ్రఫీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే.. సంస్కరణల ప్రకారం ఏ గ్రూపు విద్యార్థులైనా జాగ్రఫీని ఒక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చనే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad