Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Chennai: ఏపీ మైనర్ మినరల్స్ ఈ-ఆక్షన్ పై రోడ్ షో

Chennai: ఏపీ మైనర్ మినరల్స్ ఈ-ఆక్షన్ పై రోడ్ షో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరుల మైనింగ్ పై ఔత్సాహికులను ఆకర్షించేందుకు గనులశాఖ ఆధ్వర్యంలో చెన్నైలో రోడ్ షో నిర్వహించారు. ఫిక్కి ఆధ్వర్యంలో చెన్నైనగరంలోని ఐటిసి చోళలో నిర్వహించిన ఈ రోడ్ షోకు దాదాపు 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి రోడ్ షోలో పాల్గొన్న ఔత్సాహికులకు వైయస్ జగన్ మైనింగ్ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను, పారదర్శక విధానాలను గురించి వివరించారు.

- Advertisement -

ఏపీలో ఈ ఏడాది దాదాపు 1200 ఏరియాలు అంటే సుమారు 6 వేల హెక్టార్ లలోని చిన్నతరహా ఖనిజ నిల్వలకు ఈ – ఆక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఖనిజ సంపదను వెలికితీయడం ద్వారా పారిశ్రామిక ప్రగతిని సాధించవచ్చని అన్నారు. గతంలో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానం ఉండేదని, దీనివల్ల మైనింగ్ రంగంలోకి రావాలని భావించే వారికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. దీనిలో మార్పులు తీసుకువస్తూ మైనర్ మినరల్స్ మైనింగ్ లో ఈ-ఆక్షన్ విధానంనూ అమలు లోకి తేవడం వల్ల అందరికీ అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయన్నారు.

పలు రాష్ట్రాల్లో ఈ తరహా రోడ్ షో లను నిర్వహించడం ద్వారా ఔత్సాహికుల్లో అవగాహనను పెంచడం, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నామని తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్, 27వ తేదీన భువనేశ్వర్, మార్చి 2వ తేదీన బెంగుళూరులో రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. ఏపీలోని గ్రానైట్, క్వార్డ్జ్, సిలికాశాండ్, డోలమైట్, రోడ్ మెటల్, గ్రావెల్ తదితర చిన్నతరహా ఖనిజాల మైనింగ్ పై ఆసక్తి ఉన్న వారిని ఈ రోడ్ షోలలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News