వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట(Tirupati Stampede)లో మృతి చెందిన కుటుంబాలకు రూ.25లక్షల నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చెక్కులను హోం మంత్రి అనిత(Anitha), టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్(Palla Srinivas), ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీ చిరంజీవి రావు పంపిణీ చేశారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చనిపోయిన వారిని తలుచుకుని బాధిత కుటుంబసభ్యులు కంటతడి పెట్టుకున్నారు. వారిని హోంమంత్రి అనిత ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున రూ.25 లక్షలు, బోర్డు సభ్యుల తరఫున రూ. 2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే కుటుంబంలో ఒక వ్యక్తికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం.. చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.