CM Chandrababu- Dy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ భేటీలో పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని రాజకీయ అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతించారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చినందుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

