కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో చిరుత పులి కలకలం రేపింది. గుడికల్ గ్రామ సమీపంలోని చెరువు పక్కన ఉన్న కొండల్లో పసువుల కాపరులు గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి ఇరుక్కుంది. గత కొన్ని రోజులుగా ఆ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో మేకలు, కుక్కలను చంపుతున్నట్లు పశువుల కాపరులు గ్రామస్థులు గమనించారు. ఇందులో భాగంగా ఏదో జంతువు సంచరిస్తున్నట్లు భావించారు. గ్రామస్థులు ఏర్పాటు చేసిన వలలో చిరుత పులి ఇరుక్కుంది. పారిపోవడానికి వీలు లేకుండా కాళ్ళు బంది అయ్యాయి. దీంతో ఎక్కడికీ వెళ్ళలేక అక్కడే పడుకొని ఉంది. ఉదయం గ్రామస్థులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత పులిను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పులి ఆగ్రహంతో గాండ్రిస్తూ ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. మత్తు మందు ఇవ్వడానికి సంబంధిత అధికారులను రప్పించారు. చివరికి మత్తు మందు ఇచ్చి బంధించారు. బోనులో వేసి వాహనంలో తీసుకెళ్లారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఏమైనా వన్య మృగాలు ఉన్నాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. కాటిరమలో డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, ఆదోని రేంజర్ తేజస్వాని, నాయుడు, అర్ఐ లక్ష్మన్న, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Chitah in Gudikal: ఉచ్చులో చిరుత పులి
గుడికల్ కొండల్లో చిరుత కలకలం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES