Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్CM CBN says good days and good roads: సంక్రాంతి నాటికి గుంతలు...

CM CBN says good days and good roads: సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు

రాష్ట్రమంతా గుంతలు లేని రోడ్లు..

రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వున్న రోడ్లన్నింటినీ వచ్చే సంక్రాంతి నాటికి గుర్తులు లేని రహదారులుగా రూపొందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు తమ రాష్ట్రంలోని రోడ్డును చూసి గర్వపడే విధంగా రోడ్లు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.860 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రహదారులు కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు అనకాపల్లి జిల్లా పరవాడలో శనివారం శ్రీకారం చుట్టారు. వెన్నెలపాలెం జంక్షన్ వద్ద రోడ్డు మరమ్మత్తు పనుల శిలాఫలకం ఆవిష్కరించి తానే స్వయంగా యంత్రాన్ని ఆపరేట్ చేసి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం కూటమి ప్రభుత్వం చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణ ను వివరించారు.
సంక్రాంతి సమయంలో రోడ్లపైకి డ్రోన్లను పంపించి గుంతలను తనిఖీ చేయిస్తామని చెప్పారు. సకాలంలో రోడ్ల పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రోడ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నీ నరకానికి రహదారులుగా తయారయ్యారని ముఖ్యమంత్రి చెప్పారు వీటన్నిటికీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి రెండు నెలల్లో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దే బాధ్యత రోడ్లు భవనాల శాఖపై పెట్టామన్నారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మంచి రోడ్లు కూడా వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. అది పరవాడ గ్రామం నుంచే ప్రారంభం అవుతుందన్నారు.

రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో అన్ని రోడ్ల అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో రు.76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని వీటిని రెండున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనికి అదనంగా మరో రూ.50 వేల కోట్ల ఖర్చు చేసి భోగాపురం- మూలపేట, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ ఈస్ట్ బైపాస్ వంటి రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే ఐదు ఏళ్లలో మొత్తం రూ.1.25 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరగబోతున్నట్టు వెల్లడించారు

దేశంలోనే అతిపెద్ద సముద్రతీరం మన రాష్ట్రానికి ఉందని, తద్వారా మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు అనేక పోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో రైల్వే రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కోల్ కతా చెన్నై మధ్య నాలుగు లేన్ల రైలు మార్గం ఏర్పాటు కానుందని దీనివల్ల ప్రయాణ సమయం ఆదా కావడంతోపాటు ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతికి రైలు మార్గం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూ.2500 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు కావలసి ఉందని గత ఐదేళ్లలో రైల్వే జోన్ కి అవసరమైన భూమిని కేటాయించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే 52 ఎకరాల స్థలాన్ని ముడసరలోవ వద్ద కేటాయించడంతో త్వరలో రైల్వే జోన్ కు శంకుస్థాపన జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు అధికంగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా పారిశ్రామిక పాలసీని రూపొందించామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఇంటికో పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే విధంగా అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోను ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని తద్వారా యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించనునట్టు తెలిపారు. అయా గ్రామంలో లబించే వనరుల ఆధారంగానే చిన్నపాటి వ్యాపారాలు పరిశ్రమలను ఏర్పాటు చేయించే విధంగా చర్యలు చేపడతామన్నారు.

వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పోలవరం నీటిని అందించి అనకాపల్లిని కరువు పేదరికం రహిత జిల్లాగా రూపొందిస్తామన్నారు అనకాపల్లి ప్రజలు నీతికి నిజాయితీకి మారుపేరు అని నిరూపించారని మూడు రాజధానులు అనే పేరుతో మోసం చేయాలని చూసినా మూడు రాజధానులు మాకొద్దు అభివృద్ధి ముద్దు అంటూ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు దీనిని లాభాల బాటలోకి నడిపే విధంగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు

రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపత్తనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్డు లేని వీధి అనేది లేకుండా చేస్తామన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 24 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చే ఐదేళ్లలో అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా మారుస్తామన్నారు.

త్వరలోనే డ్వాక్రా మహిళలకు డ్రోన్లు అందజేయనున్నామని వాటిని వినియోగించి రైతుల పంట పొలాల్లో పురుగు మందులు చెల్లించే విధంగా చర్యలు చేపడతామన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఆడబిడ్డలే పై స్థానంలో ఉండేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.
మహిళలు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు మహిళను విలాస వస్తువుగా భావించే వారికి కఠిన దండన తప్పదని పేర్కొంటూ ఖబర్దార్ అని హెచ్చరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేసి మహిళలపై అకృత్యాలను నిరోధించే విధంగా చర్యలు చేపడతామన్నారు.
మద్యం పాలసీ అమలు విషయంలో రాజీపడబోమని ఎక్కడ బెల్ట్ షాపు పెట్టినా బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వరదలు వంటి ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్ టెక్నాలజీని వినియోగించే విధానానికి మన రాష్ట్రంలోనే శ్రీకరం చుట్టామన్నారు ఇటీవల విజయవాడ వరదల్లో వరద బాధితులకు మందులు దళిత రత్యావసర సహాయాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించామన్నారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లలో గాడితప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కోన్నారు

సభలో నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి

దీపం పథకంలో మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ లను అందించే కార్యక్రమం ద్వారా తాను కూడా టీ చేయడం నేర్చుకున్నట్టు చెప్పారు. మగవారు అంతా ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తమ భార్యలకు టీ చేసివ్వడం ద్వారా వారిని తమతో సమానంగా గౌరవించ వచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సి వున్న రూ.1061 కోట్ల బిల్లుల బకాయిలు చెల్లించడంతో పాటు రోడ్ల మరమ్మత్తులకు రూ.860 కోట్లు మంజూరు చేయడం ద్వారా తమ శాఖ తలెత్తుకునేలా చేశారని చెప్పారు.
రోడ్లు భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై ప్రజంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రహదారులు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని ముఖ్యమంత్రి గారికి వివరించిన వెంటనే వివిధ పద్దుల కింద రూ.860 కోట్లను రోడ్ల మరమ్మత్తు పనుల కోసం మంజూరు చేశారని చెప్పారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి గుంతలు లేని రహదారులుగా రూపొందిస్తామన్నారు

ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అర్బన్ మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ పివిజి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News