CM Chandrababu Quantum Skilling Course: క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఏపీ నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే 50 వేలకు పైగా అడ్మిషన్లు నమోదు కాగా.. లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/national-news/rahul-gandhi-mgnrega-protest-rae-bareli/
ఏపీని క్వాంటం రీసెర్చ్ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్‌పీటీఈఎల్ (NPTEL) కింద అందిస్తున్న ‘అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్’ కోర్సుకు రాష్ట్రం నుంచి విశేష స్పందన లభిస్తోందని.. కోర్సు విజేతలను వ్యక్తిగతంగా సత్కరిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ‘X’లో పోస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/merit-scholarships-workers-children-telangana-labour-board/
‘క్వాంటం టెక్నాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్న తమ లక్ష్యానికి ఈ స్పందన మరింత బలాన్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతాం. భవిష్యత్తు క్వాంటం టెక్నాలజీదే. ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిని వ్యక్తిగతంగా సత్కరిస్తా. క్వాంటం రంగంలో భవిష్యత్ ప్రపంచ నాయకులుగా ఎదిగే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

