CM Chandrababu Tamilnadu Elections: ఇండి కూటమి ఓడించింది ప్రధానిని కాదు.. దేశాన్ని అని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్ష పార్టీలు మహిళల ఆశలను ఓడించాయని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించి ఏమి సాధించారో డీఎంకే చెప్పాలన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కోయంబత్తూరులో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఇండి కూటమి పార్టీలు మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండి కూటమి, డీఎంకే ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండి కూటమి నేతలు అడ్డుకున్నారని, మహిళా సాధికారతకు ఆ కూటమి వ్యతిరేకమని ఆరోపించారు.
తమిళనాడు ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. ఒకప్పుడు ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న తమిళనాడు, ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే పాలనలో తమిళనాడులో నేరాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ప్రతి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో, పారదర్శక విధానాలతో పనిచేయాలని సూచించారు.
‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడం ద్వారా ‘ఇండి’ కూటమి ప్రధాని మోదీని కాదు, దేశాన్నే ఓడించింది. ఇది దేశానికి చేసిన ద్రోహం. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును అడ్డుకోవడం ద్వారా ఆ కూటమి మహిళా శక్తిని ఎదగనీయకుండా చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లింది. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘ఇండి’ కూటమి పనిచేస్తోంది. దేశాభివృద్ధి కోసం మోదీ నాయకత్వాన్ని బలపరచాలి.’- సీఎం చంద్రబాబు
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-inspects-medigadda-barrage-renovation-works/
కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్లు గణనీయంగా పెరిగి, రాజకీయ ప్రాతినిధ్యం మెరుగయ్యేదని చంద్రబాబు అ్నారు. 50 శాతం సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెబుతుంటే డీఎంకే ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగాలని డీఎంకే కోరుకుంటోందా అని మండిపడ్డారు. 2027 జనాభా లెక్కల ప్రకారం డీ-లిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వెలిబుచ్చారు.

