Friday, March 13, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu- Pawan: ముగిసిన చంద్రబాబు, పవన్‌ భేటీ.. ఆ అంశాలపై విస్తృత చర్చలు

Chandrababu- Pawan: ముగిసిన చంద్రబాబు, పవన్‌ భేటీ.. ఆ అంశాలపై విస్తృత చర్చలు

Chandrababu- Pawan: సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం సాగగా.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలపై చర్చించారు. 

- Advertisement -

మంగళగిరిలో ‘ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం’ సందర్భంగా జరిగిన అటవీ శాఖ ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్న అనంతరం.. నేరుగా అక్కడి నుంచి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై ఇరువురు నేతలూ చర్చించారు. 

Also Read: https://teluguprabha.net/gallery/vijay-rashmika-house-warming-and-vratam-photos-viral/

జలజీవన్‌ మిషన్‌

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల పురోగతిపై ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ వివరించారు. అనంతరం రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పనుల స్థితిగతులు, నిధుల వినియోగంపై చర్చకు వచ్చింది. జలజీవన్‌ మిషన్‌లో భాగంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు తలసరి 55 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, కేంద్రం ఈ మిషన్ గడువును 2028 వరకు పొడిగించగా.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.

మ్యాజిక్‌ డ్రెయిన్స్‌

వివిధ పంచాయతీల్లో అమలు చేస్తున్న ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ ప్రాజెక్ట్ వివరాలను పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును అన్ని పంచాయతీలకు విస్తరించాలని ఇరువురు నేతలు సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్టు’ పురోగతిని పవన్ కళ్యాణ్.. సీఎంకు వివరించారు.

Also Read: https://teluguprabha.net/international-news/earthquake-in-south-iran-4-3-magnitude-on-richter-scale-scale/

టీటీడీ వివాదాలపై చర్చ

గత కొన్ని రోజులుగా టీటీడీలో కల్తీ లడ్డూ ఘటన వ్యవహారం వైరల్‌ అవుతున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియోల అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ పవిత్రతను కాపాడటంతో పాటు, వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ కోణాలను వీరు విశ్లేషించినట్లు సమాచారం. అదేవిధంగా టీటీడీ ప్రసాదాల్లో నాణ్యత, భక్తుల సౌకర్యాలపై కూడా చర్చించారు. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News